ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో వైయస్ భారతి రెడ్డి పిఏ మరియు వైఎస్ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డిని జగ్గయ్యపేట కోర్టులో బుధవారం పోలీసులు హాజరపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు పోలీసులు తరలించారు.