కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని వైసీపీ నియోజకవర్గ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలు, చిన్నారుల మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం, పోలీసుల్లో ఎందుకు చలనం లేదని ప్రశ్నించారు.