జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) చొరవతో విలియంపేటలో తీరిన తాగునీటి కష్టాలు శనివారం తీరాయి. జగ్గయ్యపేట పురపాలక సంఘ పరిధిలోని 14 వార్డు విలియంపేట ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కు స్థానికులు పదిరోజుల క్రితం తెలిపారు. విలియంపేట ప్రాంతానికి అధికారులు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రతో కలిసి వెళ్లి త్రాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.