మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నేతలు బుధవారం వత్సవాయిలో పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమ్మె సన్నాహక సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కనీస వేతనం రూ. 26వేల అమలు, లేబర్ కోడ్స్ రద్దు, వేతన కమీషన్ల నియామకం తదితర డిమాండ్స్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలన్నారు.