భక్తి శ్రద్ధలతో సామూహిక పారాయణం

71చూసినవారు
భక్తి శ్రద్ధలతో సామూహిక పారాయణం
భక్తి శ్రద్ధలతో సౌందర్య లహరి సామూహిక పారాయణ కార్యక్రమాన్ని శనివారం భక్తులు నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని అద్దాల బజారులో కొలువై ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలను నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళా భక్తులు సామూహికంగా సౌందర్య లహరి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విశేష పూజలలో భక్తులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్