సాక్షిపత్రిక కథనాలపై మండిపడిన మంత్రి సత్యకుమార్ యాదవ్

58చూసినవారు
సాక్షిపత్రిక కథనాలపై మండిపడిన మంత్రి సత్యకుమార్ యాదవ్
ఎన్టీఆర్ వైద్య సేవలపై సాక్షిపత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. సాక్షి యాజమాన్యం ఇకనైనా తప్పుడు, అబద్ధపు ప్రచారాలను ఆపాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రికలో ఎన్టీఆర్ వైద్య సేవలపై వచ్చిన అసత్యపు వార్తా కథనాలపై మంత్రి ఆగ్రహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆదివారం నాడు మంత్రి సత్యకుమార్ పర్యటించారు. పీవీఆర్ పంక్షన్ హాల్లో జయప్రద ఫౌండేషన్ ఉచిత నేత్ర చికిత్స వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యం వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు.

సంబంధిత పోస్ట్