ఎన్టీఆర్ జిల్లా: బాల కార్మికుల రక్షణ సామాజిక బాధ్యత

52చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా: బాల కార్మికుల రక్షణ సామాజిక బాధ్యత
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ గురువారం కలెక్టరేట్ లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల కార్మికులను రక్షించడాన్ని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలన్నారు. బాల కార్మికులు లేని సమాజాన్ని కలసికట్టుగా నిర్మించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్