ఉపాధి రంగాల్లో ప్రోత్సహించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ ప్రోత్సహిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి. వి. నరసింహారావు అన్నారు. ఎంపీ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మంగళవారం జగ్గయ్యపేట తక్కెలపాడు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.