పెడన పట్టణంలోని 23వ వార్డులో ఉన్న బ్రహ్మపురంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున బ్రహ్మపురంలోని వివేకానంద పార్కు పక్కనే ఉన్న ఒక చిల్లర కొట్టులో దొంగలు రేకులు తీసి లోనికి చొరబడి నిత్యావసర సరుకులను, నగదును, వెండి వస్తువులను అపహరించారు. 15 రోజుల క్రితమే ఒక ఆర్ఎంపి వైద్యుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రివేళల్లో తాళాలు పగలగొట్టి ఇంటిలోని విలువ చేసే బంగారాన్ని దోచేశారు.