ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం సందర్బంగా సిమెంటు ఉత్పత్తి పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులు తూనికలు, కొలతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా తూనికలు కొలతల శాఖ సహాయ నియాత్రకులు భాను ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన జరిగే మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ముందుగా జగ్గయ్యపేట లో శుక్రవారం సిమెంట్ కంపెనీలో కార్మికులకు, యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించమన్నారు.