నిరుపేదలకు అన్న క్యాంటీన్ వరం

61చూసినవారు
కైకలూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిరుపేదలకు వరం అని జనసేన నాయకుడు కొల్లి బాబి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏర్పాటైన అన్న క్యాంటీన్ రోజూ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, డొక్క సీతమ్మ స్ఫూర్తితో జనసేన యువనాయకుడు ముత్యాల తరుణ్ సాయి ఆర్థిక సాయంతో 400 మందికి అన్నదానం చేశారు. తోట లక్ష్మి, ఏం. రామకృష్ణ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్