రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమంతో వంద రోజుల్లోనే పాల నలో మార్పు చూపించి మంచి ప్రభుత్వం అనిపించుకున్నామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరు మండలం ఆచవరం గ్రామం లో ఆదివారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.