అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి పెద్దపీట

59చూసినవారు
అభివృద్ధికి, సంక్షేమ పథకాలకి పెద్దపీట
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన కొనసాగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. కలిదిండి మండలం భాస్కరరావు పేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇలాంటి మంచి అనుభవం, దూరదృష్టి ఉన్న ప్రభుత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆర్డీఓ ఖజవాలిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్