టీడీపీలో ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలని ప్రమాద భీమా కల్పించినట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన సత్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రమాద భీమా ద్వారా మంజూరైనా రూ.5 లక్షల విలువైనా చెక్కును ఎమ్మల్యే మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.