పూర్వ విద్యార్థి దాతృత్వంతో కంప్యూటర్ లు వితరణ

71చూసినవారు
పూర్వ విద్యార్థి దాతృత్వంతో కంప్యూటర్ లు వితరణ
చదువుతో తనకు ఉన్నత గుర్తింపునిచ్చిన ఉపాధ్యాయుల మాటకు ఓ పూర్వ విద్యార్థి దాతృత్వం చాటు కున్నారు. మండవల్లి మండలం భైరవపట్నం ఎంపీయూపీ పాఠ శాల హెచ్ఎంగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం తాను చదువు చెప్పిన పూర్వ విద్యార్థి చెరుకువాడకు చెందిన దాసరి సనాతనను పాఠశాలకు సహాయాన్ని అందించాలని కోరారు. ఉపాధ్యాయుడి కోరిక మేరకు శుక్రవారం రూ. 60వేల విలువైన నాలుగు కంప్యూటర్లను వితరణ చేశారు. గ్రామస్తులు దాతను అభినందించారు.

సంబంధిత పోస్ట్