జూలై 1న జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. నియోజకవర్గ, మండల, అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, అన్ని పార్టీ పదువుల్లో ఉన్న నాయకులు జనసేన, బీజేపీ ఎన్‌డీఏ కూటమి నాయకులందరూ ఆయా సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.