జులై 1 నుంచి 6 వరకు 29 గ్రామపంచాయతీలలో గ్రామసభలు

60చూసినవారు
జులై 1 నుంచి 6 వరకు 29 గ్రామపంచాయతీలలో గ్రామసభలు
మండలంలో జులై 1 నుంచి 6 వరకు 29 గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మి శనివారం తెలిపారు. గ్రామ సభల్లో ఆర్థిక నివేదిక, ఆడిట్ నివేదికలు, పరిపాలన నివేదికలు, చేపట్టిన, చేపట్టనున్న పనుల వివరాలు, ఇంటి పన్నులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించాలన్నారు. 1న పెరికేగూడెం, చింతపాడు, 2న అల్లినగరం, గన్నవరం, భైరవపట్నం, మొఖాసాకలవపూడి, 3న లోకుమూడి, పులపర్రు, పుట్లచెరువులో జరుగుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్