ఉపాధ్యాయ వృత్తిని బరువుగా కాకుండా బాధ్య తగా నిర్వహించిన వారు ఏ ఉద్యోగికీ అవకాశం లేని విధంగా విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నూజివీడు ఇన్ఛార్జి డీవై ఈవో, ఎంఈవో-1 శేవ్యా నాయక్ అన్నారు. బుధవారం ముదినేపల్లి ఎమ్మార్సీ భవనంలో చిగురుకోట, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు వి. సూర్యప్రకాశరావు, బైసాని రఘునాధబాబు పదవీ విరమణ సందర్భంగా పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.