ముదినేపల్లిలో ఇంటర్ ఫలితాలు ఇలా

53చూసినవారు
ముదినేపల్లిలో ఇంటర్ ఫలితాలు ఇలా
ఇంటర్ ఫలితాల్లో ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల గతంకంటే కొంత మెరుగ్గా ఫలితాలు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 79శాతం, ప్రథమ సంవత్సరంలో 63శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓఎస్ఎన్. మూర్తి శనివారం తెలిపారు. సీఈసీ విద్యార్థిని బి. మహేశ్వరీ 862 మార్కులు, ఎంపీసీ విద్యార్ధిని కె. గాయిత్రీ 854 మార్కులతో కళాశాల ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్