ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని, కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని ఇందిరా పర్యవరణ భవన్ లో కేంద్ర మంత్రిని ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం కలుసుకున్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.