కొల్లేరు సమస్య పరిష్కారం కొరకు ఈనెల 15, 16వ తేదీలలో కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవి మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో ఎమ్మెల్యే భేటీ అయ్యి కొల్లేరుపై చర్చించనున్నారు. అనంతరం సుప్రీంకోర్ట్ లో కొల్లేరుపై అఫిడవిట్ దాఖలు చేయనున్నారని తెలిపారు.