కైకలూరు నీటిసంఘాల డీసీ ఛైర్మన్ పొత్తూరి సురేశ్ రాజు, ఆధ్వర్యంలో మంగళవారం కైకలూరు మండలం గోనెపాడు నుంచి భుజబలపట్నం గ్రామాల పంట కాలువలో ఏర్పడిన చెత్తను తొలగించారు. ధర్మకోల్, గుర్రపుడెక్క, నిల్వ ఉండి నీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో, కూలీలు, ట్రాక్టర్, జెసిబిలతో సహాయంతో శుభ్రం చేశారు. అనంతరం పల్లెవాడ గ్రామం పంచాయితీ చెరువుకు నీటిని అందించారు.