కొల్లేరు పరిస్థితిని అధ్యయనం చేయడానికి కేంద్ర సాధికార కమిటీ రెండురోజుల పాటు కొల్లేరు ప్రాంతంలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ బృందం మంగళ, బుధవారాల్లో కొల్లేరులో క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో ప్రజలెదుర్కొంటున్న కష్టాలపై ఎమ్మెల్యేలు ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. దీంతో వారి ఎదురుచూస్తున్నారు.