కైకలూరు: నేడు ఉత్సవాలపై కోఆర్డినేటర్ సమావేశం

66చూసినవారు
కైకలూరు: నేడు ఉత్సవాలపై కోఆర్డినేటర్ సమావేశం
కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామ శ్రీ పెద్దింటి అమ్మవారి జాతరకు సంబంధించి కో- ఆర్డినేటర్ కమిటీ సమావేశం ఈనెల 4 జరుగుతుందని ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్ అధ్యక్షతన కైకలూరు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10: 00 గం.లకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సంబంధిత కో- ఆర్డినేటర్ సభ్యులు హాజరు కావాలన్నారు. మార్చి 1 నుంచి 13 వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్