కైకలూరు మండలం ఆటపాకలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండో మంచినీటి సరస్సు కొల్లేరు. స్వదేశీ, విదేశీ పక్షుల విడిది కేంద్రం. ఇక్కడ 185 రకాల పక్షులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పెలికాన్, పెయింటెడ్ స్టాక్స్ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కొల్లేరు సరస్సులో ఆటపాక పక్షుల కేంద్రానికి సైబీరియా, ఆస్ట్రేలియా, కెనెడా తదితర దేశాల నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణించి ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో వలస వస్తుంటాయి.