కైకలూరు మండలం కొల్లేటికోట లో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలను మార్చి 1 నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి బుధవారం ఆర్డిఓ అంబారిష్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.