కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళల్లో క్యాన్సర్ వ్యాప్తి పెరిగినందున, మన రాష్ట్రంలో యువతులకు సెర్వికల్ క్యాన్సర్ కు వేసే వ్యాక్సిన్ ను ప్రభుత్వం తరఫున వేయాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.