మండవల్లి, కొల్లేరులో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇంగిలిపాకలంక, పెనుమాకలంక గ్రామాల్లో పెద ఎడ్లగాడి వరకు ఉన్న రోడ్ల దుస్థితిని శుక్రవారం పరిశీలించారు. కొల్లేరులో రహదారుల అభివృద్ధికి రూ. 7. 85కోట్లు నిధులతో ప్రతిపాదనలు చేశామని నాలుగు రోజుల్లో పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.