మండవల్లి గ్రామంలోని మండవల్లి - మూడుతాళ్ల పాడు రైల్వే గేటును మరో 2 రోజులు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఎండి అబ్దుల్ రహమాన్ శుక్రవారం తెలిపారు. లెవల్ క్రాసింగ్ 74 వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి కాకపోవడంతో గేట్లు మూసివేసినట్లు తెలిపారు. ఈనెల 15న రాత్రి 7గంటల వరకు గేటు మూసివేసి ఉంటుందన్నారు. వాహనదారులు, గ్రామస్థులు తమకు రైల్వే సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.