ముదినేపల్లి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం ఉంటుందని చెప్పారు. కావున మండల అధికారులు మరియు పరిషత్ సభ్యులు హాజరుకావాలని కోరారు.