ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని వి కన్వెన్షన్ హాల్ లో బుధవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని నియోజకవర్గం లోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.