ముదినేపల్లి, పెదపాలపర్రు 33 కెవి సబ్ స్టేషన్లలో శనివారం మరమ్మతులు నిర్వహిస్తున్నామని గుడివాడ డీఈ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. కావున గృహ, వాణిజ్య, ఆక్వా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.