కైకలూరు మండలంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.