ముదినేపల్లి మండలం సింగరాయపాలెం -బంటుమిల్లి రహదారిలో ఉప్పరగూడెం వంతెన సమీపంలో చెట్టు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వీచిన ఈదురుగాలులకు చెట్టు కూలింది. రెండు రోజులుగా చెట్టు తొలగించకపోవడంతో రాత్రులు కనిపించక వాహనదారులు ప్రమాదం బారినపడుతున్నారు. అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.