రేపు ముదునేపల్లిలో పబ్లిక్ గ్రీవెన్స్ ప్రోగ్రాం

57చూసినవారు
రేపు ముదునేపల్లిలో పబ్లిక్ గ్రీవెన్స్ ప్రోగ్రాం
ఏలూరు జిల్లా ముదినేపల్లి వి. కన్వెన్షన్ హాల్‌లో కైకలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజల వద్ద అర్జీలు స్వీకరిస్తారని ఆయన కార్యాలయం మంగళవారం పేర్కొంది. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటారని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్