మండవల్లి మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం వీధిలైట్లకు పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. వీధి లైట్లు వెలగక చీకట్లో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు సర్పంచ్ మెండ ఝాన్సీ సురేశ్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్పంచ్ వీధి లైట్లకు మరమ్మతులు చేయించారు. మెయిన్ రోడ్డు వెంబడి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, బ్లీచింగ్ చల్లించి పరిసరాలను పరిశుభ్రం చేయించారు.