వరద బాధితుల సహాయార్థం రూ. 3 లక్షల రూపాయల విరాళం అందించేందుకు.. పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కానూరుకు చెందిన షామిరాక్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసికట్టుగా రూ. 3లక్షల రూపాయల బ్యాంకు చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు.