చదువు వల్ల వినయ విధేయతలు వస్తాయి

79చూసినవారు
చదువు వల్ల వినయ విధేయతలు వస్తాయి
చదువుతో కూడిన సంస్కారం పెద్దల పట్ల వినయ విధేయతలు అందిస్తుందని, అది నేటి తరం యువత తెలుసుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అన్నారు. ప్రపంచవృద్ధుల దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు చందమామ బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణయ్య మాట్లాడుతూ పిల్లలకు బాల్య దశ నుండి పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్