మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ హైస్కూలు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 సీలింగ్ ఫ్యాన్లను మంగళవారం అందజేశారు. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర హైస్కూల్ ను సందర్శించిన సమయంలో కొంత మంది విద్యార్థులు ఫ్యాన్స్ లేవని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన తన స్వచ్చంద సంస్థ కొల్లు ఫౌండేషన్ ద్వారా 15 ఫ్యాన్లు అందజేశారు.