విస్సన్నపేటలో అక్రమంగా తరలిస్తున్న 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వారికి వచ్చిన సమాచారం మేరకు వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఈమేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.