ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని సుఖర్లబాద్ నందు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పింఛన్ నగదు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. 10 వార్డు డివిజన్ ఇంచార్జ్ కోస్తా మురళి, రామ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.