కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకోండి

62చూసినవారు
కృష్ణా: ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకోండి
దీపం- 2 పథకంలో భాగంగా 2025-26లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దరఖాస్తు చేయాలని జేసీ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మూడు విడతల్లో సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్-జులైలో మొదటిది, ఆగస్టు-నవంబర్లో రెండోది, డిసెంబర్-మార్చిలో మూడోది ఉచితంగా అందించనున్నారు. గతేడాది 3, 60, 500 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 59, 333 పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్