కృష్ణా: 'నేటి నుంచి ధాన్యం కేంద్రాలు ఓపెనింగ్'

72చూసినవారు
కృష్ణా: 'నేటి నుంచి ధాన్యం కేంద్రాలు ఓపెనింగ్'
2024-25 పంట కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలు శనివారం నుంచి జిల్లాలో తెరిచి ఉంటాయని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్