కృష్ణా: అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

77చూసినవారు
కృష్ణా: అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా నిర్వహించుకుంటూ ఆయన ఆశయాలను, కార్యదక్షతను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. శాంతి భద్రతలకు లోబడి ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్