ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తపించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు.