కృష్ణా: పందుల నుండి ప్రజలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు

74చూసినవారు
కృష్ణా: పందుల నుండి ప్రజలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు
పట్టణాల పరిధిలో పందుల నుండి ప్రజలకు ముప్పు వాటిల్లకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో పందుల వలన కలిగే ముప్పు నివారణ పై సంబంధిత అధికారులు, పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు. పందుల పెంపకందారులు పందులను పట్టణాల్లో, ఎక్కడపడితే అక్కడ పెంచకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్