శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ. బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.