ఈనెల 22వ తేదీన జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు, సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు జడ్పీ సీఈఓ శనివారం సాయంత్రం తెలిపారు. ఉదయం 10 గంటలకు జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు, 11 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశం ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిథులు, అధికారులు ఈ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు.