8వ తరగతి చదువుతున్న తన కుమారిడిపై హత్యాయత్నం కేసు పెట్టారని గుడివాడకు చెందిన మహిళ మాజీ మంత్రి పేర్ని నాని ఎదుట వాపోయారు. మచిలీపట్నంలో ములాఖత్ కు వచ్చిన పేర్ని నానిని జైలు వద్ద ఓ మహిళ కలిశారు. టపాసుల వివాదంలో చిన్న గొడవ జరిగిందని, ఆ నేపథ్యంలో తన కొడుకుని జైలుకు పిలిపించి హత్యాయత్నం కేసు పెట్టారని ఆరోపించారు. పిల్లాడి భవిష్యత్తు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.