ఈ నెల 6వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( మీకోసం) నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు.